ఎలక్ట్రిక్ వాహనాల కోసం 10 లక్షల ఫాస్ట్ చార్జర్లు: అమితాబ్ కాంత్

భారత్‌లో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి కనీసం 10 లక్షల ఫాస్ట్ చార్జర్లు అవసరమని మాజీ NITI ఆయోగ్ CEO, అమితాబ్ కాంత్ అన్నారు.

Update: 2024-04-07 12:55 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించడానికి కనీసం 10 లక్షల ఫాస్ట్ చార్జర్లు అవసరమని మాజీ NITI ఆయోగ్ CEO, అమితాబ్ కాంత్ అన్నారు. దేశంలో ఈవీ తయారీ కంపెనీలు పరస్పరం సహకరించుకుని వేగవంతమైన చార్జింగ్ నెట్‌వర్క్‌ను రూపొందించాలి, ఇది భారత్‌లో ఈవీ ఉద్యమానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. టూవీలర్, త్రీవీలర్ విభాగంలో 100 శాతం ఎలక్ట్రిక్‌కు మారడానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే ఈవీల పెట్టుబడికి ఇక్కడ చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. భారత్ మూడవ అతిపెద్ద ప్రపంచ ఆటో మార్కెట్‌ను కలిగి ఉంది. ఈవీ వాహనాలు, వాటికి అవసరమయ్యే విడిభాగాలను దిగుమతి చేసుకునే బదులు స్థానికంగా తయారయ్యేలా కంపెనీలు ప్రయత్నించాలని ఆయన అన్నారు.

భారతదేశ ఆటోమోటివ్ రంగాల పరివర్తన కీలకమని అమితాబ్ కాంత్ అన్నారు, ఎందుకంటే దాని GDPకి 7 శాతం, తయారీ GDPకి 35 శాతం, మొత్తం ఎగుమతులకు 8 శాతం ఈవీలు దోహదం చేస్తాయని తెలిపారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం, 2023లో భారతదేశ ఈవీ అమ్మకాలు దాదాపు రెండింతలు పెరిగాయి. ఈవీల పట్ల ప్రభుత్వం అందించే సహకారం, వినియోగదారుల ఆసక్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి కారణంగా ఈ సంవత్సరం అమ్మకాలు 66 శాతం పెరిగే అవకాశం ఉంది.


Similar News