ఎండ దెబ్బకు వాహనం దగ్ధం

దిశ, ఆదిలాబాద్: జిల్లాలో రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండలకు జిల్లాలో శుక్రవారం ఒక వాహనం దగ్ధమైంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం డోడర్న- 2 గ్రామ శివారులో టాటా మ్యాజిక్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎండ తీవ్రతకు వాహన ఇంజిన్ తీవ్ర స్థాయిలో వేడెక్కి వాహనం దగ్ధం అయినట్లు యజమాని తెలిపారు. వాహనంలో జొన్నలు, ఉల్లి, గోధుమ సంచులు ఉండగా… మంటల్లో అవి కూడా దహనమయ్యాయి. రైతు జాదవ్ సునీల్ […]

Update: 2020-05-29 02:20 GMT

దిశ, ఆదిలాబాద్: జిల్లాలో రోజురోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 46 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఎండలకు జిల్లాలో శుక్రవారం ఒక వాహనం దగ్ధమైంది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం డోడర్న- 2 గ్రామ శివారులో టాటా మ్యాజిక్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఎండ తీవ్రతకు వాహన ఇంజిన్ తీవ్ర స్థాయిలో వేడెక్కి వాహనం దగ్ధం అయినట్లు యజమాని తెలిపారు. వాహనంలో జొన్నలు, ఉల్లి, గోధుమ సంచులు ఉండగా… మంటల్లో అవి కూడా దహనమయ్యాయి. రైతు జాదవ్ సునీల్ తమ పొలం నుంచి ఇంటికి తీసుకువెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భైంసా నుంచి ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే వాహనం, సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో ఆ రైతు కుటుంబంలో ఆవేదనను మిగిల్చింది.

Tags:    

Similar News