బండి, కిషన్ రెడ్డి యాత్రలు ఎందుకు చేపడుతున్నారో చెప్పాలి

దిశ, తెలంగాణ బ్యూరో : బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర ఎందుకు చేపడుతున్నారో ప్రజలకు చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినందుకు ఒక్కపైసా కేటాయించనందుకా, ఆదుకుంటామని హామీ ఇచ్చి ఆదుకోనందుకా.. ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని అన్నారు. కేంద్రం ప్రభుత్వ భూములను విక్రయించి ఆరు లక్షల కోట్లు సేకరించాలని చూస్తుందని, అందులో భాగంగానే 21 ఎకరాల […]

Update: 2021-08-27 04:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బండి సంజయ్ ప్రజా సంకల్ప యాత్ర ఎందుకు చేపడుతున్నారో ప్రజలకు చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినందుకు ఒక్కపైసా కేటాయించనందుకా, ఆదుకుంటామని హామీ ఇచ్చి ఆదుకోనందుకా.. ఎందుకు చేపడుతున్నారో చెప్పాలని అన్నారు. కేంద్రం ప్రభుత్వ భూములను విక్రయించి ఆరు లక్షల కోట్లు సేకరించాలని చూస్తుందని, అందులో భాగంగానే 21 ఎకరాల రైల్వే భూమిని మౌలాలిలో అమ్మేందుకు పెడుతుందని ఆరోపించారు. పేదలకు ఇళ్లు నిర్మిస్తామని రెండు ఎకరాలు రైల్వే భూమి కేటాయించాలని కేంద్రాన్ని కోరితే స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.

మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ ఇండియన్ పేర్కొంటూనే ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుందని ధ్వజ మెత్తారు. ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం ప్రకటించి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలోని పబ్లిక్ సెక్టార్‌లో11 లక్షల 30 వేల 840 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అందులో 1.76 లక్షల ఉద్యోగాలు దళితులకు, లక్ష ఉద్యోగాలు ట్రైబల్, రెండు లక్షల ఉద్యోగాలు బీసీలకు ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామని చెప్పి ఒక్కపైసా కేటాయించలేదని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇచ్చిందనా, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చామనా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకా లేక ప్రభుత్వ భూములను గుర్తించి అమ్మడానికి యాత్ర చేపడుతున్నారా అని ప్రశ్నించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి యాత్రలు ఎందుకు చేపడుతున్నారు ప్రజలకు చెప్పి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నా, రాజకీయ నిరుద్యోగుల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశానికి ప్రధాని అయినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు. చిలుక మనదే కానీ పలుకు పరాయిది అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ను చంద్రబాబు ప్రాంచైజీ తీసుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు యావ తప్ప ఇంకొకటి లేదని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2 నుంచే జెండా పండుగను నిర్వహిస్తామని చెప్పారు. 2 నుంచి 12వ తేదీ వరకు వార్డు గ్రామ కమిటీలు, 12 నుంచి 20 వరకు మండల పట్టణ కమిటీలు, 20 తర్వాత రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుందని, సెప్టెంబర్ చివరి నాటికి సంస్థాగత నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేసే వారికే కమిటీలో చోటు ఉంటున్నట్లు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు కమిటీ లో 51 శాతం ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. పార్టీ అనుబంధ కమిటీలతో పాటు సోషల్ మీడియా కమిటీలతోపాటు మండల, పట్టణ, నియోజకవర్గ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సంస్థాగత నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కమిటీల నిర్మాణంపై రెండు రోజుల్లో శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. 150 డివిజన్లలో డివిజన్ కమిటీలు,1400 ఏరియాలో బస్తీ కమిటీలు, జిల్లా కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు ఒకటి వరకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు అంతా ఢిల్లీకి చేరుకోవాలని సూచించారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News