బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు వేలం..!
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మొదటి దశ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ముంబై టు అహ్మదాబాద్‌కు సంబంధించి గురువారం కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించింది. ఆ ప్రాజెక్టును దక్కించుకునేందుకు పలు భారతీయ ఇన్ ఫ్రా కంపెనీలు పోటీ పడ్డాయి. రూ.20వేల కోట్ల మొదటి టెండర్ వేలంలో లార్సెన్ అండ్ టుబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా ప్రాజెక్ట్స్, అఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో పాటు మరో మూడు కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. కాగా, నేషనల్ హేవే స్పీడ్ […]
దిశ, వెబ్‌డెస్క్ :
దేశంలో మొదటి దశ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ముంబై టు అహ్మదాబాద్‌కు సంబంధించి గురువారం కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించింది. ఆ ప్రాజెక్టును దక్కించుకునేందుకు పలు భారతీయ ఇన్ ఫ్రా కంపెనీలు పోటీ పడ్డాయి. రూ.20వేల కోట్ల మొదటి టెండర్ వేలంలో లార్సెన్ అండ్ టుబ్రో, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా ప్రాజెక్ట్స్, అఫ్కాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌తో పాటు మరో మూడు కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి.
కాగా, నేషనల్ హేవే స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రాజెక్టులు దేశంలో మొత్తం ఆరింటిని చేపట్టనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.