అధికారులకు షాక్.. గుమ్మడిదల తహసీల్దార్ ఆఫీసుకు తాళం
దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయానికి తాళం పడింది. నాలుగేళ్లుగా అద్దె ఇవ్వడం లేదంటూ భవన యజమానులు కార్యాలయానికి మంగళవారం తాళం వేశారు. ఉదయం రోజూలాగే కార్యాలయానికి వచ్చిన అధికారులు, సిబ్బంది ఆఫీసుకు తాళం వేసి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. అనంతరం యజమానికి సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయానికి వచ్చి యజమానులతో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు.