బ్రోకర్ వి నువ్వే.. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై బక్క జడ్సన్ తిట్ల దండకం
దిశ ప్రతినిధి, వరంగల్: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలను, ఎమ్మెల్యేలను బ్రోకర్లు, జోకర్లుగా అభివర్ణించడంపై జడ్సన్ తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. జీవన్‌రెడ్డి కల్వకుంట్ల కుటుంబ సభ్యుల వద్ద, సచివాలయంలో బ్రోకర్ వేశాలు వేస్తాడంటూ దూషించారు. ఆర్మూరులో సత్యం బ్రదర్స్‌ను లారీతో తొక్కించి చంపారని జీవన్‌రెడ్డిపై జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీవు చేసే ఆరోపణలకు మా పార్టీ పెద్దలు కాదు.. నేనే వస్తా..ఇంట్లోకి వచ్చి చెప్పుతో కొడతా’ […]
దిశ ప్రతినిధి, వరంగల్: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతలను, ఎమ్మెల్యేలను బ్రోకర్లు, జోకర్లుగా అభివర్ణించడంపై జడ్సన్ తీవ్ర పదజాలంతో తిట్టిపోశారు. జీవన్‌రెడ్డి కల్వకుంట్ల కుటుంబ సభ్యుల వద్ద, సచివాలయంలో బ్రోకర్ వేశాలు వేస్తాడంటూ దూషించారు. ఆర్మూరులో సత్యం బ్రదర్స్‌ను లారీతో తొక్కించి చంపారని జీవన్‌రెడ్డిపై జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నీవు చేసే ఆరోపణలకు మా పార్టీ పెద్దలు కాదు.. నేనే వస్తా..ఇంట్లోకి వచ్చి చెప్పుతో కొడతా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం జడ్సన్ హన్మకొండలోని ఆయన ఇంటి నుంచి మాట్లాడిన వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. బ్రోకర్ పనులు చేసేది టీఆర్‌ఎస్ నాయకులని, మీ పార్టీ నాయకుడే దుబాయ్ శేఖర్ అంటూ విమర్శించారు. దళితులను అన్నిచోట్లా అవమానాలకు గురిచేస్తున్నారని అన్నారు. దళితులను చంపించిన చరిత్ర టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు ఉందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు తోడు దొంగలంటూ పేర్కొన్నారు. దళితులపై జరిగిన మర్డర్లపై సీబీఐ ఎక్వయిరీ చేయించే దమ్ము, ధైర్యం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందా..? అంటూ సవాల్ విసిరారు.
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాక, ఇంద్రవెల్లిలో సభ విజయవంతమయ్యాకా టీఆర్ఎస్ నేతల్లో వణుకు పుడుతోందని అన్నారు. కాళేశ్వరం మొదలు అనేక అంశాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. మాదిగలకు పార్టీలో, ప్రభుత్వంలో ఏ మాత్రం గౌరవం లేదని, పదవులు లేవని, హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకే దళితబంధు తీసుకువచ్చారని అన్నారు. ఈ విషయాలన్నింటిని కూడా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.