చైనాలో మరో మహమ్మారి… 24 గంటల్లోనే ప్రాణాలు పోవచ్చు
దిశ, వెబ్ డెస్క్: చైనాలో మరోసారి బుబోనియా ప్లేగు మహమ్మారి వ్యాపించే అవకాశాలున్నాయి. ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లో ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడినట్టు వైద్య అధికారులు ధృవీకరించారు. వీరిని వేరు వేరు ఆసుపత్రులలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన 146 మందిని ఐసోలేషన్ లో ఉంచారు. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేసి లెవెల్-3 హెచ్చరికలు జారీ చేసారు అక్కడి అధికారులు. ఈ విషయాలని ధృవీకరించిన చైనా […]
దిశ, వెబ్ డెస్క్: చైనాలో మరోసారి బుబోనియా ప్లేగు మహమ్మారి వ్యాపించే అవకాశాలున్నాయి. ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లో ఇద్దరు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడినట్టు వైద్య అధికారులు ధృవీకరించారు. వీరిని వేరు వేరు ఆసుపత్రులలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరితో కాంటాక్ట్ అయిన 146 మందిని ఐసోలేషన్ లో ఉంచారు. దీంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేసి లెవెల్-3 హెచ్చరికలు జారీ చేసారు అక్కడి అధికారులు. ఈ విషయాలని ధృవీకరించిన చైనా వైద్య అధికారిక శాఖ… ప్రజలు మెరుగైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరింది.
ఈ వ్యాధిలక్షణాలు… ఎలా సోకింది…?
మెడ, గజ్జలు, చంకలలో కోడిగుడ్డు ఆకారంలో శోషరస కణుపులు పెరగడం దీని ముఖ్య లక్షణం. కొందరిలో చలి, జ్వరం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. కాగా ముర్మోట్ అనే ఉడుత జాతి మాంసం తినడం వలన ఈ వ్యాధి సోకినట్లు భావిస్తున్నారు. దీంతో ఆ మాంసం తినొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
కరోనా కంటే డేంజర్…!
ఈ వ్యాధి కోవిడ్-19 కంటే భయంకరంగా ఉంది. బుబోనిక్ ప్లేగు సోకిన వ్యక్తిని గుర్తించి 24 గంటలలోపు చికిత్స అందించకపోతే రోగి మరణించగలడు. పోయినేడాది కూడా ఈ మాంసం తిని వెస్ట్ మంగోలియాలో అనేకమంది చనిపోయారు.
800 ఏళ్ళ తర్వాత మళ్ళీ…
800 ఏళ్ళ క్రితం జస్టీనియన్ ప్లేగు కు కారణమైన ఎర్సీనియా పెస్టిస్ బాక్టీరియా ఇప్పుడు బుబోనిక్ ప్లేగు గా రూపాంతరం చెందినట్టు నిపుణులు గుర్తించారు. 1347 వ సంవత్సరం యూరోప్ లో విజృంభించిన ఈ వ్యాధి భారిన పడి నాలుగేళ్లలో దాదాపు 20 కోట్ల మంది బలయ్యారు. బ్లాక్ డెత్ గా పిలిచే ఈ అంటు వ్యాధి నివారణకు ఐసోలేషన్ ఒకటే మార్గమని వ్యాధిగ్రస్తులను ఐసోలేషన్ లో ఉంచేవారు.