వారాంతంలో స్వల్ప లాభాలు
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు లాభపడగా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా కంపెనీలు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటడం, ఆర్థిక వ్యవస్థపై నీలిమేఘాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త పడటంతో బీఎస్‌ఈ, నిఫ్టీల్లో ట్రేడింగ్ స్తబ్దుగా సాగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సెన్సెక్స్ ట్రేడింగ్‌లో గరిష్ఠంగా 300 పాయింట్లు, నిఫ్టీ గరిష్ఠంగా 11,231.90 […]
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్ సంస్థలు లాభపడగా, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా కంపెనీలు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటడం, ఆర్థిక వ్యవస్థపై నీలిమేఘాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు జాగ్రత్త పడటంతో బీఎస్‌ఈ, నిఫ్టీల్లో ట్రేడింగ్ స్తబ్దుగా సాగిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
సెన్సెక్స్ ట్రేడింగ్‌లో గరిష్ఠంగా 300 పాయింట్లు, నిఫ్టీ గరిష్ఠంగా 11,231.90 పాయింట్లను తాకింది. చివరికి సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 38,040 వద్ద ముగియగా, నిఫ్టీ 14 పాయింట్లు ఎగబాకి 11214 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్‌ఈలో అత్యధిక ప్రభుత్వరంగ బ్యాంకు సూచీలు 1శాతం లాభ పడ్డాయి.
నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో మొబైల్, బ్యాంక్ సూచీలు 0.5 శాతం నుంచి 0.8శాతం మధ్య పెరిగాయి. మరోవైపు నిఫ్టీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, రియల్ ఎస్టేట్ సూచీలు 0.3 శాతం నుంచి 1శాతం మధ్య పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు 1 శాతానికిపైగా పెరిగాయి. ఎసియన్ పెయింట్స్ అత్యధిక లాభాలు పొందింది. ఆ సంస్థ సూచీలు 4.65శాతం లాభపడి, షేరు ధర రూ.1807కు చేరుకుంది.
బజాజ్ ఫైనాన్స్ , యూపీఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారత్ పెట్రోలియం, బ్రిటానియా ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, గెయిల్ ఇండియా సూచీలు 1.3 నుంచి 3.7శాతం మధ్యలో లాభపడ్డాయి. మరోవైపు టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండియన్ ఆయిల్, లార్సన్ అండ్ టర్బో, విప్రో, అల్ర్టా టెక్ సిమెంట్, టీసీఎస్ సూచీలు నష్టపోయాయి. మొత్తంగా బీఎస్‌ఈలో 1661 సూచీలు పెరగగా, 1042 సూచీలు నష్టపోయాయి.