తమ్ముడిని ఉరేసి చంపిన అన్న
దిశ, హైదరాబాద్: అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. సొంత తమ్ముడినే అన్న ఉరేసి చంపిన సంఘటన చోటు చేసుకుంది. హత్యకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నారెడ్డినగర్‌లో నివసించే మహ్మద్ మునావర్( 32)కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల కిత్రం స్థానికంగా ఉండే కల్పనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సంసారంలో మనస్పర్థలు రావడంతో రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. పిల్లలు తల్లి […]
దిశ, హైదరాబాద్: అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. సొంత తమ్ముడినే అన్న ఉరేసి చంపిన సంఘటన చోటు చేసుకుంది. హత్యకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నారెడ్డినగర్‌లో నివసించే మహ్మద్ మునావర్( 32)కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల కిత్రం స్థానికంగా ఉండే కల్పనను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సంసారంలో మనస్పర్థలు రావడంతో రెండేళ్లుగా విడిగా ఉంటున్నారు. పిల్లలు తల్లి వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మానసిక వేదనకు గురైన మునావర్ మద్యానికి బానిసై కుటంబ సభ్యులతో వాగ్వాదానికి దిగేవాడు. నిత్యం సోదరుడిని దూషిస్తుండటంతో గొడవలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి దాటక 1.30గంటల సమయంలో మద్యం తాగి వచ్చిన మునావర్ సోదరుడితో ఘర్షణపడ్డాడు. తమ్ముడిపై తీవ్ర ఆగ్రహానికి గురైన అన్న షాహిద్.. మునావర్‌ను తాడుతో ఉరేసి చంపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.