వరసకు చెల్లితో ప్రేమాయణం..పెద్దలు నో చెప్పడంతో!

దిశ, వెబ్ డెస్క్: వరసకు చెల్లి అయ్యే అమ్మాయితో ఓ యువకుడు ప్రేమాయణం సాగించాడు. విషయం ఇంట్లో తెలియడంతో సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఇలా చేయడం తప్పని పెద్దలు మందలించారు. దీంతో తమ ప్రేమను నిరాకరించారనే కారణంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌ ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జతిన్ (పేరు మార్చాం) అతడి దగ్గరి బంధువు నీల(పేరు మార్చాం) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరవురి ఇళ్లలో తెలియడంతో వారు […]

Update: 2020-07-28 11:54 GMT

దిశ, వెబ్ డెస్క్: వరసకు చెల్లి అయ్యే అమ్మాయితో ఓ యువకుడు ప్రేమాయణం సాగించాడు. విషయం ఇంట్లో తెలియడంతో సాంప్రదాయాలకు విరుద్ధమని.. ఇలా చేయడం తప్పని పెద్దలు మందలించారు. దీంతో తమ ప్రేమను నిరాకరించారనే కారణంతో ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌ ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. జతిన్ (పేరు మార్చాం) అతడి దగ్గరి బంధువు నీల(పేరు మార్చాం) గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరవురి ఇళ్లలో తెలియడంతో వారు చెల్లి వరుస యువతితో ప్రేమ తప్పని గ్రామపెద్దలతో పాటు, బంధువులంతా మందలించారు. అంతేకాదు ఇలా చేసి కుటుంబ పరువు తీయొద్దని వారిద్దరితో వారించారు.

కొద్దిరోజులకే ఆ యువతికి ఇంట్లో పెళ్లి సంబంధం ఒకే చేసి.. మరో వారంలో వివాహం చేయాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో మనస్తాపం చెందిన ప్రేమజంట తామిక జీవితాంతం కలవమని నిర్థారించుకొని, ఇంటి నుంచి పారిపోయి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News