అతడి చెరనుంచి తప్పించుకున్న పాప్ సింగర్.. కన్నీరు పెట్టుకుంటూ

దిశ, సినిమా:  పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు విముక్తి లభించింది. తన లైఫ్‌ను కంట్రోల్ చేస్తున్న తండ్రి జేమ్స్ స్పియర్ కన్జర్వేటర్‌షిప్‌కు ఎండ్ కార్డ్ పడింది. 13 ఏళ్లుగా తండ్రి గార్డియన్‌షిప్‌లో ఇబ్బందులు పడుతున్న తను.. లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. తండ్రిని ఈ బాధ్యతల నుంచి తప్పించాలని, తనకు స్వేచ్ఛనివ్వాలని బ్రిట్నీ కొన్ని నెలల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు […]

Update: 2021-09-30 03:47 GMT

దిశ, సినిమా: పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు విముక్తి లభించింది. తన లైఫ్‌ను కంట్రోల్ చేస్తున్న తండ్రి జేమ్స్ స్పియర్ కన్జర్వేటర్‌షిప్‌కు ఎండ్ కార్డ్ పడింది. 13 ఏళ్లుగా తండ్రి గార్డియన్‌షిప్‌లో ఇబ్బందులు పడుతున్న తను.. లాస్ ఏంజిల్స్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. తండ్రిని ఈ బాధ్యతల నుంచి తప్పించాలని, తనకు స్వేచ్ఛనివ్వాలని బ్రిట్నీ కొన్ని నెలల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి బ్రెండా పెన్నీ.. ప్రస్తుతమున్న పరిస్థితి ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతూ బ్రిట్నీకి అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ జడ్జ్‌మెంట్‌తో షాక్ అయిన ఆమెకు నోటమాట రాలేదని, సంతోషంతో ఎగిరి గంతులేసిందని ఇంటర్నేషనల్ మీడియా ప్రచురించింది. కాగా డిసెంబర్ 31 వరకు తాత్కాలిక కన్జర్వేటర్‌గా ఎకౌంటెంట్ జాన్ జబెల్‌ను నియమించనున్నారు.

Tags:    

Similar News