బ్రిటన్ ప్రధాని ఇండియా టూర్ క్యాన్సిల్..
దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. ప్రస్తుతం ఆ దేశంతో పాటు ఇండియాలోనూ కొత్త కరోనా ( స్ట్రెయిన్ వైరస్) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండియా పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా జాన్సన్ 2021 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాల్సి ఉంది. కొవిడ్ విజృంభణ కారణంగా భారత పర్యటనను ఆయన ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, యూనైటెడ్ కింగ్‌డమ్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయింది. ప్రస్తుతం ఆ దేశంతో పాటు ఇండియాలోనూ కొత్త కరోనా ( స్ట్రెయిన్ వైరస్) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇండియా పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. సాధారణంగా జాన్సన్ 2021 జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావాల్సి ఉంది. కొవిడ్ విజృంభణ కారణంగా భారత పర్యటనను ఆయన ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా, యూనైటెడ్ కింగ్‌డమ్‌లో స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో మంగళవారం మూడోసారి లాక్ డౌన్ విధించారు. దేశ ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని, ఎవరూ నిర్లక్ష్యంగా బయటకు రాకూడదని.. చివరి ప్రయత్నంగా అందరూ కలసికట్టుగా వైరస్ ను ఓడించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు.