మనకు సాయమందింది..!
దిశ, వెబ్‌డెస్క్: అనేక దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా దేశాల ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ఇండియాలో సైతం లాక్‌డౌన్ కొనసాగుతోన్నది. నాలుగో దశ కూడా ఉంటుందని ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో పోరాడేందుకు బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంక్.. ఇండియాకు 1 బిలియన్ డాలర్ల( సుమారు రూ. 7536 కోట్లు) ఎమర్జెన్సీ రుణ సాయాన్ని అందించింది. ఈ మొత్తంతో ఆర్థిక కష్టాల నుంచి నిలదొక్కుకునేందుకు, ఇప్పటిదాకా జరిగిన […]
దిశ, వెబ్‌డెస్క్: అనేక దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా దేశాల ఖజానాలు ఖాళీ అవుతున్నాయి. ఇండియాలో సైతం లాక్‌డౌన్ కొనసాగుతోన్నది. నాలుగో దశ కూడా ఉంటుందని ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో పోరాడేందుకు బ్రిక్స్ దేశాల అభివృద్ధి బ్యాంక్.. ఇండియాకు 1 బిలియన్ డాలర్ల( సుమారు రూ. 7536 కోట్లు) ఎమర్జెన్సీ రుణ సాయాన్ని అందించింది. ఈ మొత్తంతో ఆర్థిక కష్టాల నుంచి నిలదొక్కుకునేందుకు, ఇప్పటిదాకా జరిగిన నష్టాలను కొంతవరకు పూడ్చేందుకు సాయంగా ఉంటుందని న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఎన్‌డీబీ) అభిప్రాయపడింది.
చైనాలోని షాంఘై కేంద్రంగా ఎన్‌డీబీ బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 2014లో రష్యా, ఇండియా, బ్రెజిల్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు సంయుక్తంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేశాయి. దీనికి ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రధానంగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు దేశాల మధ్య నిధుల సాయం లక్ష్యంగా బ్రిక్ దేశాలు ఈ బ్యాంకును ఏర్పాటుచేసుకున్నాయి. బ్రిక్స్ దేశాల బ్యాంక్ చేసిన రుణ సాయం ప్యాకేజీ ముందు తక్కువ మొత్తమే అయినప్పటికీ ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ రుణం దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.