SRH కోచింగ్ స్టాఫ్‌లో బ్రియన్ లారా, సైమన్ కటిచ్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే సీజన్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావించిన యాజమాన్యం ఇప్పటికే పలువురు ఆటగాళ్లను విడుదల చేసింది. మెగా ఆక్షణ్‌కు ఇంకా సమయం ఉండటంతో కోచింగ్ స్టాఫ్ నియామకాలు చేపడుతున్నది. మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌ను వీడటంతో టామ్ మూడీని తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టున్నారు. తాజాగా వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ […]

Update: 2021-12-23 09:18 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శన చేసి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే సీజన్ కోసం అప్పుడే సన్నాహాలు మొదలు పెట్టింది. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావించిన యాజమాన్యం ఇప్పటికే పలువురు ఆటగాళ్లను విడుదల చేసింది. మెగా ఆక్షణ్‌కు ఇంకా సమయం ఉండటంతో కోచింగ్ స్టాఫ్ నియామకాలు చేపడుతున్నది. మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ ఐపీఎల్‌ను వీడటంతో టామ్ మూడీని తిరిగి హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టున్నారు.

తాజాగా వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియన్ లారాను బ్యాటింగ్ కోచ్‌గా నియమించింది. లారాను కేవలం బ్యాటింగ్ కోచ్‌గా మాత్రమే పరిమితం చేయకుండా వ్యూహాత్మక సలహాదారుగా కూడా బాధ్యతలు అప్పగించింది. బ్రియాన్ లారా వెస్టిండీస్ తరఫున 133 టెస్టులు, 299 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 34 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలతో 11953 పరుగులు చేశాడు. దీంతో పాటు వన్డేల్లో 19 సెంచరీల సాయంతో 10405 పరుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అతని పేరిట 53 సెంచరీలు, 22358 పరుగులు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్, గత సీజన్‌లో ఆర్సీబీ కోచ్‌గా పని చేసిన సైమన్ కటిచ్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించింది. భారత జట్టు మాజీ క్రికెటర్ హేమంగ్ బదానీని ఫీల్డింగ్ కోచ్, స్కౌట్‌గా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను నియమించగా.. గత కొన్ని సీజన్ల నుంచి మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు.

Tags:    

Similar News