యూపీ పీఠం బీజేపీదే.! 35 ఏళ్ల రికార్డ్ తిరిగి రాయనున్నారా?

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది.

Update: 2022-03-10 05:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. ఐదు రాష్ట్రాల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించలేక పోయింది. అయితే, బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్ పీఠంపై ఫోకస్ చేసి భారీ ఎత్తున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లో యోగీ ఆదిత్యనాథ్ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేశారు. ఈ క్రమంలో కాసేపట్లో ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షాలు బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. యూపీలో బీజేపీ ఓడిపోతుందని ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ తిరిగి మోడీ, యోగీ ఎఫెక్ట్ మళ్లీ రిపీట్ అయ్యింది. ఇదే విధంగా రిజల్ట్స్ కొనసాగితే.. తిరిగి రెండో సారి బీజేపీ అధికారంలోకి రానుంది. దీంతో 35 ఏళ్ల రికార్డును యోగి తిరిగి రాయనున్నారు. అయితే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకొని ఫలితాలపై సమీక్షిస్తున్నారు.

Tags:    

Similar News