వల్లభనేని వంశీతో పాటు అధికార పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. మంగళవారం ఉదయంనుంచే ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. మంగళవారం ఉదయంనుంచే ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో ఏక కాలంలో 36 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రముఖ బిల్డర్ వంశీరామ్ ఇంట్లో, ఆయన కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి. ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేగాక, వంశీరామ్ బంధువు జనార్థన్ రెడ్డి ఇంట్లోనూ ఐటీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మొత్తం పదిహేను చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నట్లు సమాచారం. మరోపక్క ఏపీలోనూ 21 బృందాలుగా విడిపోయి తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. విజయవాడలోని ఇద్దరు వైసీపీ నేతల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాశ్ ఇళ్లలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : వంశీరామ్ బిల్డర్స్‌పై ఐటీ ఫోకస్.. దాడుల్లో వెలుగులోకి సంచలన విషయాలు