BREAKING : బీఆర్ఎస్ అహంకారాన్ని ప్రజలు పసిగట్టి ఓడించారు.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అహంకారాన్ని పసిగట్టి ప్రజలు వారిని గద్దెదిపారని.. ఇప్పటికైనా వారికి బుద్ధి రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అహంకారాన్ని పసిగట్టి ప్రజలు వారిని గద్దెదిపారని.. ఇప్పటికైనా వారికి బుద్ధి రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సూర్యపేటలో మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని, అందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ఏర్పడి రోజులు కూడా గడవక ముందే తమ పనితీరుపై ప్రతిపక్ష నేతలు విమర్శలకు దిగడం మంచి పద్ధతి కాదన్నారు. బాధ్యయుతమైన పదవిలో ఉండి ఎంపీ బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యాక్రమాన్ని బీజేపీ ఈవెంట్‌గా మార్చేశారని ఫైర్ అయ్యారు.
Read More..