BIG BREAKING : రాష్ట్రంలో ఇక నూతన విద్యుత్ పాలసీ.. అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో అతి త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Update: 2024-01-10 14:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో అతి త్వరలో నూతన విద్యుత్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ సచివాలయంలో విద్యుత్ శాఖపై నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ సరఫరాపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అసెంబ్లీ కూలకశంగా చర్చించిన తరువాత కొత్త పాలసీ రూపొందిస్తామని తెలిపారు. అదేవిధంగా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్, ఆరు గ్యారంటీల్లోని ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో 2014 నుంచి జరిగిన విద్యుత్‌ ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేయాలని విద్యుత్ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. విద్యుత్‌ను తక్కువ ధరకు ఇచ్చే కంపెనీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల విద్యుత్‌ పాలసీలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News