BREAKING: మంచిర్యాలలో ఘరానా మోసం.. రూ.1.25 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు
మంచిర్యాలలో ఘరానా మోసం చోటుచేసుకుంది. ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు అప్పనంగా కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాలలో ఘరానా మోసం చోటుచేసుకుంది. ఎస్‌బీఐ ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే సిబ్బంది చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు అప్పనంగా కొట్టేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పలు ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసేందుకు ఎస్‌బీఐ బ్యాంకు వారు థర్డ్ పార్డీ ఏజెన్సీని నియమించుకున్నారు. అయితే, పెద్ద మొత్తంలో డబ్బును చూసిన వారికి దుర్భుద్ధి పుట్టింది. కాగా, ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసే ప్రతిసారి పలు దఫాలుగా రూ.1.25 కోట్లను నిందితులు కొట్టేసినట్లుగా ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో తేలింది. ఎస్‌బీఐ బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు మోహన్, పూర్ణచందర్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా నిందితుల నుంచి రూ.50 వేల నగదు, ప్రామీసరీ నోట్లు, చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.