సచివాలయం కూల్చివేతకు బ్రేక్!

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు బ్రేక్ పడింది. కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నగరానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు సచివాలయ కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. వారంరోజుల కిందట నూతన సచివాలయం నిర్మించడం, పాత సచివాలయం కూల్చివేయడం అనే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన […]

Update: 2020-07-10 02:10 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సచివాలయం కూల్చివేతకు బ్రేక్ పడింది. కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. నగరానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు సచివాలయ కూల్చివేత పనులను నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే.. వారంరోజుల కిందట నూతన సచివాలయం నిర్మించడం, పాత సచివాలయం కూల్చివేయడం అనే అంశాలు రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంటూ సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మంగళవారం సచివాలయం కూల్చివేత పనులు చేపట్టారు. నాలుగు రోజుల నుంచి నిర్విరామంగా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలివ్వడంతో ఆ పనులు నిలిచిపోనున్నాయి.

Tags:    

Similar News