వామ్మో.. ఈ యేడు కూడా లగ్గం కానట్టేనా..? యువతీయువకుల గగ్గోలు!
దిశ, వెబ్‌డెస్క్ : వేణుకు 30 ఏళ్లు దాటాయి. ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యాడు. ఇంట్లో వాళ్లు, బంధుమిత్రులు పెళ్లి ఎప్పుడు అంటూ పదేళ్లుగా పోరు పెడుతున్నారు. వేణు కూడా ఆలోచనలో పడ్డాడు. మంచి పొజిషన్‌లో సెట్ అయ్యాను కదా.. ఎన్నాళ్లీ ఒంటరి జీవితం అనుకున్నాడు. గతేడాది పెళ్లికి ఓకే చెప్పేశాడు. వెంటనే తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయిని చూశారు. ఇక లగ్గం వచ్చే నెలలో కానిద్దాం అనుకునే లోపే లాక్ డౌన్ వచ్చేసింది. పెళ్లి ఆగిపోయింది. […]
దిశ, వెబ్‌డెస్క్ : వేణుకు 30 ఏళ్లు దాటాయి. ఉద్యోగం చేస్తూ సెటిల్ అయ్యాడు. ఇంట్లో వాళ్లు, బంధుమిత్రులు పెళ్లి ఎప్పుడు అంటూ పదేళ్లుగా పోరు పెడుతున్నారు. వేణు కూడా ఆలోచనలో పడ్డాడు. మంచి పొజిషన్‌లో సెట్ అయ్యాను కదా.. ఎన్నాళ్లీ ఒంటరి జీవితం అనుకున్నాడు. గతేడాది పెళ్లికి ఓకే చెప్పేశాడు. వెంటనే తల్లిదండ్రులు ఓ మంచి అమ్మాయిని చూశారు. ఇక లగ్గం వచ్చే నెలలో కానిద్దాం అనుకునే లోపే లాక్ డౌన్ వచ్చేసింది. పెళ్లి ఆగిపోయింది.
వనిత ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. 28 ఏళ్లు ఉండే ఆమె.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా స్థిరపడింది. తల్లిదండ్రులు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేక ఇన్ని రోజులు వివాహం గురించి బలవంతం చేయలేదు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ బంధువులు చెవులు కొరుక్కోవడం చూసి పెళ్లి చేసుకోవాలని పతం పట్టారు. వాళ్ల మాట కాదన లేక వనిత పెళ్లికి రెడీ అయింది. వెంటనే ఆమెకు ఈడూ జోడు ఉన్న అబ్బాయితో వివాహం నిశ్చయించారు. ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని పెళ్లి ముహూర్తం చేసేలోపే లాక్ డౌన్ వచ్చిపడింది.
ఇలా 2020 నుండి గ్రాండ్‌గా పెళ్లి తంతు చేసుకుందాం అనుకున్న వాళ్లందరినీ కరోనా అడ్డుకున్నది. ప్రస్తుతం 2021లో పెళ్లికి సిద్ధమైన వారికి జనవరి నుంచి అధిక మూడాల పేరిట నాలుగు నెలలుగా లగ్గాలే లేకుండా పోయాయి. మే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని పెళ్లి పనులు సిద్ధం చేసుకుంటున్న పెళ్లింటి వారికి మరో పిడుగులాంటి వార్త వినిపిస్తోంది. మే 2 నుండి మళ్లీ లాక్ డౌన్ పెడతారనే భయం పట్టుకుంది. దీంతో పెళ్లీడుకు వచ్చిన యువతీయువకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కరోనా వచ్చి మా లగ్గాలను పాడు చేస్తుందని శాపనార్ధాలు పెడుతున్నారు. వామ్మో.. ఈ యేడు కూడా లగ్గం లేనట్టేనా..? అని విరహ వేదనలతో తల్లడిల్లిపోతున్నారు.