హుజురాబాద్‌లో నామినేషన్లకు బ్రేక్.. ఎందుకో తెలుసా.?

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రెండు రోజులు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు ఇరువురు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా శనివారం అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో రెండు రోజులపాటు నామినేషన్ల స్వీకరణకు విరామం లభించినట్లు అయింది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మొదటి రోజు రెండు సెట్ల […]

Update: 2021-10-02 00:21 GMT

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ శాసనసభ ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు రెండు రోజులు బ్రేక్ పడింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజు ఇరువురు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా శనివారం అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో రెండు రోజులపాటు నామినేషన్ల స్వీకరణకు విరామం లభించినట్లు అయింది.

టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మొదటి రోజు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా అన్న వైస్సార్ పార్టీ నుంచి మన్సూర్ ఆలీ ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందచేశారు. కాగా, వరుసగా రెండు రోజులు సెలవులు రావడం ఈ నెల 6వ తేది వరకు పితృ అమావాస్య ఉండటంతో నామినేషన్లు వేయడానికి ముహూర్తాలను నమ్మే అభ్యర్థులు వెనకడుగు వేసే అవకాశాలున్నాయి. అనంతరం గడువు రెండు రోజులే మిగిలి ఉండటంతో 7, 8 తేదీల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 

Tags:    

Similar News