నేటితో ముగియనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఆలయంలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి ఆలయంలోని తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణం ఉంటుంది. ధ్వజావరోహణంతో దేవదేవుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల నుంచి 19 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు […]

Update: 2020-09-26 21:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల ఆలయంలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకు శ్రీవారి ఆలయంలోని తాత్కాలిక లఘు పుష్కరిణిలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజావరోహణం ఉంటుంది. ధ్వజావరోహణంతో దేవదేవుని బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ నెల నుంచి 19 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆల‌యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించింది.

Tags:    

Similar News