ఇటీవల భర్త… ఇప్పుడు కొడుకు

దిశ, కోదాడ: భర్త చనిపోయిన విషాదం నుంచి కోలుకోక ముందే ఆమెను మరో విషాదం వెంటాడింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోనాల యుగంధర్ (5)ను తన తాత సరదాగా ట్రాక్టర్‌పై ఎక్కించుకుని హరితహారం మొక్కలను తీసుకువచ్చేందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా యుగంధర్ కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ టైర్ యుగంధర్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ […]

Update: 2020-06-29 06:44 GMT

దిశ, కోదాడ: భర్త చనిపోయిన విషాదం నుంచి కోలుకోక ముందే ఆమెను మరో విషాదం వెంటాడింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బోనాల యుగంధర్ (5)ను తన తాత సరదాగా ట్రాక్టర్‌పై ఎక్కించుకుని హరితహారం మొక్కలను తీసుకువచ్చేందుకు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా యుగంధర్ కింద పడ్డాడు. దీంతో ట్రాక్టర్ టైర్ యుగంధర్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి ఘటనా స్థలానికి చేరుకొని బోరున విలపించింది. తన భర్త చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఆమెకు కన్నకొడుకు కూడా దూరమవ్వడం పలువురిని కంటతడి పెట్టించింది.

Tags:    

Similar News