లక్నో కోర్టు ప్రాంగణంలో పేలుడు
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో కోర్టు ప్రాంగణంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరి గాలింపులు జరపగా.. మరో మూడు క్రూడ్ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. న్యాయవాదుల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణాలుగా తెలుస్తున్నది. న్యాయవాదులు సంజీవ్ లోధి, జీతు యాదవ్‌లు లాయర్స్ చాంబర్ వైపునకు బాంబు విసిరేసినట్టు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు సమాచారం. […]
ఉత్తర ప్రదేశ్‌లోని లక్నో కోర్టు ప్రాంగణంలో గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు న్యాయవాదులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరి గాలింపులు జరపగా.. మరో మూడు క్రూడ్ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. న్యాయవాదుల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణాలుగా తెలుస్తున్నది. న్యాయవాదులు సంజీవ్ లోధి, జీతు యాదవ్‌లు లాయర్స్ చాంబర్ వైపునకు బాంబు విసిరేసినట్టు పరస్పరం ఆరోపణలు చేసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.