జమ్ములో బాంబు పేలుళ్లు.. ఎగిరిపడిన విమానాశ్రయం పై కప్పు

దిశ,వెబ్‌డెస్క్ : జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో ఐదు నిమషాల వ్యవధిలోనే జంట పేలుళ్లు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పేలుడు ధాటికి విమానాశ్రయం భవనం పైకప్పు ఎగిరిపడింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ పేలుళ్ల వలన ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా  బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని తనిఖీలు ప్రారంభిచాయి. ఈ పేలుళ్లకు రెండు డ్రోన్లు ఉపయోగించినట్లు […]

Update: 2021-06-26 22:46 GMT

దిశ,వెబ్‌డెస్క్ : జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. విమానాశ్రయంలో ఐదు నిమషాల వ్యవధిలోనే జంట పేలుళ్లు చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ పేలుడు ధాటికి విమానాశ్రయం భవనం పైకప్పు ఎగిరిపడింది. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ పేలుళ్ల వలన ప్రాణనష్టమేమీ జరగలేదని అధికారులు తెలిపారు. కాగా బాంబు స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకొని తనిఖీలు ప్రారంభిచాయి.

ఈ పేలుళ్లకు రెండు డ్రోన్లు ఉపయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు విమానాశ్రయంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటన పై రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ హెచ్ఎస్ ఆరోరాతో మాట్లాడి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉన్నతాధికారుల ఆదేశంతో ఎయిర్ మార్షల్ విక్రమ్ సింగ్ జమ్ము వెళ్లనున్నారు.

Tags:    

Similar News