బాయ్‌కాట్.. బాలీవుడ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పలు చర్చలకు దారి తీస్తోంది. అతడి ఆత్మహత్యకు కారణం.. ఇండస్ట్రీలో నెలకొన్న ‘వారసత్వ ప్రీతి మాత్రమే’ అని పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ట్వీట్లు చేస్తున్నారు. ఈ తప్పు చేసింది మీరే అంటూ కొందరిని టార్గెట్ చేస్తున్నారు. కేవలం సుశాంత్ టాలెంట్‌ను గుర్తించకుండా ప్రతీసారీ తనకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో సుశాంత్ అభిమానులు ‘బాయ్‌కాట్’ బాలీవుడ్ పేరుతో బాలీవుడ్ నెపోటిజంకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్న […]
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పలు చర్చలకు దారి తీస్తోంది. అతడి ఆత్మహత్యకు కారణం.. ఇండస్ట్రీలో నెలకొన్న ‘వారసత్వ ప్రీతి మాత్రమే’ అని పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ట్వీట్లు చేస్తున్నారు. ఈ తప్పు చేసింది మీరే అంటూ కొందరిని టార్గెట్ చేస్తున్నారు. కేవలం సుశాంత్ టాలెంట్‌ను గుర్తించకుండా ప్రతీసారీ తనకు అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌లో సుశాంత్ అభిమానులు ‘బాయ్‌కాట్’ బాలీవుడ్ పేరుతో బాలీవుడ్ నెపోటిజంకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో బంధుప్రీతిని ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలను ‘అన్ ఫాలో’ చేస్తున్నారు.
బ్రిలియంట్ స్టూడెంట్ అయిన సుశాంత్ నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడగుపెడితే తొక్కేసే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారు. ఇండస్ట్రీ నిర్మాతలు, దర్శకులు టాలెంట్‌ను ప్రోత్సహించకుండా.. స్వార్థ పూరితంగా ప్రవర్తించారని, కేవలం వారసత్వ నటులనే ప్రోత్సహించారని విమర్శిస్తున్నారు. సినిమాలు, అవార్డులు అన్ని విషయాల్లోనూ బాలీవుడ్‌లో ఇదే జరిగిందని.. అలాంటి వారి సినిమాలను కూడా బ్యాన్ చేయాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిస్తున్నారు. బంధుప్రీతి నశించి.. టాలెంట్ ఉన్న నటీనటులకు ప్రోత్సాహం అందాలని కోరుకుంటున్నారు.