బీఎండబ్ల్యూ ప్రీమియం ఎస్‌యూవీ ఎక్స్5 కొత్త వేరియంట్ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సోమవారం తన ప్రీమియం ఎస్‌యూవీ వాహనం ఎక్స్5 కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్‌లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరను రూ. 77.9 లక్షలు(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ మూడు లీటర్ల 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ధర రూ. 77.9 లక్షలు కాగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ. 79.5 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది. ఈ వేరియంట్ […]

Update: 2021-09-13 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సోమవారం తన ప్రీమియం ఎస్‌యూవీ వాహనం ఎక్స్5 కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్‌లలో లభించే ఈ ఎస్‌యూవీ ధరను రూ. 77.9 లక్షలు(ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ వేరియంట్ మూడు లీటర్ల 6-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ధర రూ. 77.9 లక్షలు కాగా, పెట్రోల్ వేరియంట్ ధర రూ. 79.5 లక్షలుగా ఉందని కంపెనీ తెలిపింది. ఈ వేరియంట్ ఎస్‌యూవీలు దేశీయంగా చెన్నై ప్లాంట్‌లో ఉత్పత్తి చేసినట్టు పేర్కొంది. బీఎండబ్ల్యూ ఎక్స్5 మోడల్ ఆఫ్-రోడ్ సామర్థ్యంతో డైనమిక్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఆటో పరిశ్రమలో అత్యంత విజయవంతంగా కొనసాగుతున్న ఎస్‌యూవీ జాబితాలో ఈ మోడల్ ఉందని, ప్రస్తుతం ఉన్న వేరియంట్లకు అదనంగా స్పోర్ట్స్ ఎక్స్ ప్లస్ వాహనంగా ఇది ఉంటుందని’ బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు విక్రమ్ పవా ఓ ప్రకటనలో చెప్పారు. ఇందులో పెట్రోల్ వేరింట్ ఎస్‌యూవీ కారు కేవలం 6.5 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని కంపెనీ తెలిపింది. డీజిల్ వేరియంట్ 5.5 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల్దని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News