10 శాతం క్షీణించిన వాహన విక్రయాలు
దిశ, వెబ్‌డెస్క్: గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో మొత్తం వాహన విక్రయాలు 10.24 శాతం క్షీణించాయని ఆటోమొబైల్ డీలర్స్ బాడీ ఎఫ్ఏడీఏ గురువారం వెల్లడించింది. అయితే, ఫ్యాక్టరీ ఔట్‌పుట్ మాత్రం 20 శాతం అధికంగా ఉంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఆటో విక్రయాలు క్షీణించాయి. కానీ, సెప్టెంబర్ నెలలో అనేక కంపెనీల వాహనాల విక్రయాలు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చినపుడు ఈ సారి మెరుగ్గా ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ […]
దిశ, వెబ్‌డెస్క్: గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో మొత్తం వాహన విక్రయాలు 10.24 శాతం క్షీణించాయని ఆటోమొబైల్ డీలర్స్ బాడీ ఎఫ్ఏడీఏ గురువారం వెల్లడించింది. అయితే, ఫ్యాక్టరీ ఔట్‌పుట్ మాత్రం 20 శాతం అధికంగా ఉంది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా గడిచిన ఆరు నెలలుగా ఆటో విక్రయాలు క్షీణించాయి. కానీ, సెప్టెంబర్ నెలలో అనేక కంపెనీల వాహనాల విక్రయాలు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోల్చినపుడు ఈ సారి మెరుగ్గా ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) పేర్కొంది.
డీలర్ల వద్ద స్టాక్స్ కూడా పెరిగాయి. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే పండుగ సీజన్, కరోనా వ్యాప్తికి భౌతిక దూరం లాంటి ఇతర కారణాలతో అక్టోబర్, నవంబర్ నెలల్లో విక్రయాలు పెరుగుతాయని ఆటోమొబైల్ కంపెనీలు, డీలర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని ఎఫ్ఏడీఏ తెలిపింది. ఏడాది ప్రాతిపదికన ఆగష్టులో ఆటో విక్రయాలు 27 శాతం తగ్గాయి. అయితే, సెప్టెంబర్ నాటికి ఇది 10.24 శాతంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా పుంజుకుంటున్నప్పటికీ, వాహన విక్రయాలు ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని ఎఫ్ఏడీఏ పేర్కొంది.
ట్రాక్టర్ విక్రయాలు అదరహో…
ఈ ఏడాది సెప్టెంబర్‌లో మొత్తం టూ-వీలర్ విక్రయాలు 10,16,977 యూనిట్లుగా నమోదవగా, గతేడాది ఈ విభాగం 11,63,918 యూనిట్లతో పోల్చినపుడు 12.62 శాతం క్షీణత అని ఎఫ్ఏడీఏ వెల్లడించింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 9.81 శాతం పెరిగి 1,95,665 యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్ విక్రయాలు అత్యధికంగా 80.39 శాతం ఎగసి 68,564 యూనిట్లు అమ్ముడయ్యాయి.
వాణిజ్య వాహనాల విక్రయాలు గతేడాదితో పోలిస్తే 33.65 శాతం తగ్గి 39,600 యూనిట్లు విక్రయించబడ్డాయి. త్రీ-వీలర్ విక్రయాలు గతేడాది కంటే 58 శాతం వరకూ క్షీణించి 24,060 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తం ఈ ఏడాది వాహనాల విక్రయాలు గతేడాది కంటే 10.24 శాతం పడిపోయి 13,44,866 యూనిట్లుగా నమోదైనట్టు ఎఫ్ఏడీఏ తెలిపింది. కేంద్రం అమలు చేస్తున్న అన్‌లాక్ వల్ల గత మూడు నెలలుగా వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయని, సెప్టెంబర్‌లో వాహనాల రిజిస్ట్రేషన్లు గతం కంటే పెరిగాయని ఎఫ్ఏడీఏ అధ్యక్షుడు వింకేశ్ గులాటి చెప్పారు. కంపెనీలా వారిగా..గత నెలలో మారుతీ సుజుకి ఏడాది ప్రాతిపదికన 30 శాతం విక్రయాలు పెరిగిన సంగతి తెలిసిందే. ఎంజీ మోటార్స్ విక్రయాలు మాత్రమే తగ్గిపోయాయి. ఎస్కార్ట్ ట్రాక్టర్లు రికార్డు స్థాయిలో విక్రయాలను నమోదు చేసింది.