పార్టీని భూస్థాపితం చేసే సత్తా మాకుంది.. బీసీ నేతల హెచ్చరిక
దిశ, మంచిర్యాల: పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని తెలంగాణ బీసీ జాగృతి నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ బీసీల సమస్యలు, డిమాండ్లు పరిష్కారం కాలేదని అన్నారు. బీసీలకు జనాభా ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. […]
దిశ, మంచిర్యాల: పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని తెలంగాణ బీసీ జాగృతి నాయకులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నప్పటికీ బీసీల సమస్యలు, డిమాండ్లు పరిష్కారం కాలేదని అన్నారు. బీసీలకు జనాభా ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పలు రాజకీయ పార్టీలకు తమకు అనుకూలంగా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని లేఖ ఇచ్చినప్పటికీ నేటికీ బిల్లు పెట్టకపోవడం శోచనీయం అన్నారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకపోతే మమ్ములను పట్టించుకోని పార్టీలను భూస్థాపితం చేస్తామని, ఆ సత్తా మాకే ఉందని హెచ్చరించారు. ఈ నిరసనలో తెలంగాణ బీసీ జాగృతి జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మడుపు రామ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.