బ్లాక్ దందా.. ఆఠ్ కా బీస్!

దిశ, కరీంనగర్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ 4.0ను కూడా ప్రకటించాయి.ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక, ఇల్లు గడువక రాష్ట్రంలోని చాలా మేరకు నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.స్వచ్ఛంద సంస్థలు, పలువురు ముందుకు వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేయగా వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.ఇక వలస కూలీల జీవితం అయితే అగమ్య గోచరంగా మారింది. తమ స్వస్థలాలకు చేరుకోవాలని రాత్రిభవళ్లు తిండి, నిద్ర లేకుండా నడుస్తూనే ఉన్నారు.మార్గమధ్యలో ప్రమాదాలు, సాధారణ మరణాల […]

Update: 2020-05-18 05:44 GMT

దిశ, కరీంనగర్: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ 4.0ను కూడా ప్రకటించాయి.ఇప్పటికే చేతిలో చిల్లిగవ్వ లేక, ఇల్లు గడువక రాష్ట్రంలోని చాలా మేరకు నిరుపేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.స్వచ్ఛంద సంస్థలు, పలువురు ముందుకు వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేయగా వాటితోనే కాలం వెళ్లదీస్తున్నారు.ఇక వలస కూలీల జీవితం అయితే అగమ్య గోచరంగా మారింది. తమ స్వస్థలాలకు చేరుకోవాలని రాత్రిభవళ్లు తిండి, నిద్ర లేకుండా నడుస్తూనే ఉన్నారు.మార్గమధ్యలో ప్రమాదాలు, సాధారణ మరణాల వల్ల కుటుంబ సభ్యులను కోల్పొయి బరువెక్కిన గుండెతో పయనం సాగిస్తున్నారు.వీరు ఇంతా సహసానికి ఒడిగట్టింది కేవలం పట్టెడు అన్నం కోసమే. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం వాస్తవానికి పేదలకు, వలస కూలీలకు చేరడం లేదు.దీనికి కారణం..కొందరు అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై పీడీఎస్ బియ్యాన్ని ప్రజల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బ్లాక్ దందాను రామగుండం కమిషనరేట్ పోలీసులు బట్టబయలు చేశారు.
సీపీ సత్యనారాయణ కథనం ప్రకారం..పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించే వారి కోసం టాస్క్ ఫోర్స్ టీం స్పెషల్ ఆపరేషన్లు చేస్తుందన్నారు.ఈ క్రమంలోనే సోమవారం పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల సమీపంలో అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు. జీజే 11 VV 4111 నెంబరు గల లారీలో 350 క్వింటాళ్ల పీడీఎస్ ధాన్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారని వివరించారు. లారీతో పాటు టీఎస్ 22 B 1544 నెంబర్ గల టీవీఎస్ స్టార్ ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.దీనికి కారణమైన మోటం గురువయ్య, వారణాసి రమేష్, శ్యామలా రయ్యా, భీమా భాయిలను అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. రోజుకు రూ. 1కోటి విలువ చేసే పీడీఎస్ ధాన్యం అక్రమ రవాణా జరుగుతున్నదని విచారణలో వెల్లడైందన్నారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డు దారుల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కిలోకు రూ. 8 నుంచి రూ. 10లకు కొనుగోలు చేసి, వాటిని మహారాష్ట్రలోని వీరూర్ రైస్ మిల్లుకు తరలించి రూ. 20 నుంచి రూ. 25లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని నిందితులు అంగీకరించారన్నారు.ఈ దందాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ త్వరలోనే పట్టుకుంటామని సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తెలంగాణ వారితో పాటు మహారాష్ట్రలోని గోండియా ప్రాంతానికి చెందిన వారికి పలువురికి ఈ దందాతో సంబంధాలు ఉన్నట్టు గుర్తించామని, వారిని అరెస్ట్ చేస్తామని సీపీ తెలిపారు.

Tags:    

Similar News