రైతు ఉద్యమం ఆగదు: రాకేశ్ టికాయత్
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘చట్టాల వాపసీ లేనంత కాలం ఘర్ వాపసీ లేదు’ ఇదే తమ నినాదామని స్పష్టం చేశారు. తమ పోరాటం ఇప్పట్లో ముగిసిపోదని, కనీసం అక్టోబర్ వరకైనా కొనసాగుతుందని ఘాజీపూర్ సరిహద్దులో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ధీమా వ్యక్తం చేశారు. రైతులను అడ్డుకోవాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దానికే ముప్పు […]
న్యూఢిల్లీ: నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన విరమించబోమని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ తికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘చట్టాల వాపసీ లేనంత కాలం ఘర్ వాపసీ లేదు’ ఇదే తమ నినాదామని స్పష్టం చేశారు. తమ పోరాటం ఇప్పట్లో ముగిసిపోదని, కనీసం అక్టోబర్ వరకైనా కొనసాగుతుందని ఘాజీపూర్ సరిహద్దులో నిర్వహించిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ ధీమా వ్యక్తం చేశారు. రైతులను అడ్డుకోవాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దానికే ముప్పు తీసుకొస్తుందని హెచ్చరించారు. ఈ ఆదేశాల ద్వారా సాగు ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు తరలకుండా నిలిచిపోయే ప్రమాదముందని అన్నారు. అక్టోబర్ లేదా నవంబర్ వరకు రైతుల ఆందోళన కొనసాగించాలని అభ్యర్థించారు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఇనుప కంచెలు ఎన్నైనా పెట్టుకోనివ్వండి తెలిపారు. ఎర్రకోటపై జెండా ఎగరేసిన వారికి అధికారులే దారినిచ్చారని, ఇదంతా పంజాబ్ కమ్యూనిటీకి దురభిప్రాయాన్ని అంటగట్టే లక్ష్యంతో సాగిందని ఆరోపించారు. రైతులను దేశద్రోహులుగా చిత్రించడానికి ప్రయత్నించారని వివరించారు.