మున్సిపల్​ ఎన్నికల్లో బీజేపీ కొత్త పంథా.. ఓటర్ల కోసం ప్రత్యేక యాప్

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్​క్యాంపెయిన్​లో కొత్త పంథాను ఎంచుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బుధవారం నుంచే ఈ యాప్​ద్వారా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీ పర్యవేక్షిస్తోంది. స్టేట్​కమిటీ మెంబర్స్, జిల్లా అధ్యక్షులు, జనరల్​ సెక్రెటరీలు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాదాపు 6 వందల మంది బీజేవైఎం నాయకులు యాప్‌లో […]

Update: 2021-04-23 10:38 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ బీజేపీ రాష్ట్ర నాయకత్వం మున్సిపల్​క్యాంపెయిన్​లో కొత్త పంథాను ఎంచుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందించి ప్రచారాన్ని నిర్వహిస్తోంది. బుధవారం నుంచే ఈ యాప్​ద్వారా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బాధ్యతలను బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కమిటీ పర్యవేక్షిస్తోంది. స్టేట్​కమిటీ మెంబర్స్, జిల్లా అధ్యక్షులు, జనరల్​ సెక్రెటరీలు యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దాదాపు 6 వందల మంది బీజేవైఎం నాయకులు యాప్‌లో రిజిస్ట్రర్​అయ్యారు. ప్రతీ యువమోర్చా నేతకు డైయిలీ వంద నుంచి రెండు వందల మంది ఓటర్లతో మాట్లాడాలని టార్గెట్​పెట్టింది రాష్ట్ర నాయకత్వం.

అయితే రాష్ట్రంలో 2 కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. ప్రధానంగా వరంగల్​కార్పొరేషన్‌పైనే ఫోకస్ పెట్టారు కమలనాథులు. దాదాపు వరంగల్​ బల్దియాలో 3లక్షల మంది ఓటర్లకు కాల్స్​చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే యువమోర్చా నాయకులు రెండు రోజులుగా గ్రేటర్​వరంగల్​ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు. ప్రతీ బీజేవైఎం నాయకులు వంద నుంచి రెండు వందల మందికి కాల్స్​చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర పథకాలతో జరిగిన లబ్ధి, సెంట్రల్​ఫండ్స్‌తో వరంగల్‌లో అయిన అభివృద్ధి వంటి అంశాలను వారికి వివరించి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. యువమోర్చా నాయకులు ఓటర్లతో సంభాషించినప్పుడు ప్రజా నాడీ ఎలా ఉందనే అంశాలను బీజేపీ నాయకత్వం పర్యవేక్షిస్తోంది. ఎక్కడ పార్టీ బలహీనంగా ఉంది.. ఏ అంశాలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి వంటి అంశాలను విశ్లేషిస్తోంది. ఇందుకోసం ప్రతీ రోజు బీజేవైఎం నాయకులు ఓటర్లతో మాట్లాడిన తర్వాత యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్​వారితో వర్చువల్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు. ఓటర్లతో మాట్లాడినప్పుడు వారికి ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్​కూడా సంబంధిత అంశాలపై విశ్లేషణ చేసి తగు సూచనలు చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం వరంగల్ కార్పొరేషన్‌లో ముమ్మరంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాన్ని ఎన్నికల ప్రచారం ముగిసేలోపే ఖమ్మం, సిద్దిపేట బల్దియాలకు విస్తరించాలనే ఆలోచనలో కమలనాథులున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో అక్కడ ఓటర్లను ఆకట్టుకునేందుకు సెగ్మెంట్‌లో ఫోన్​సౌకర్యమున్న ప్రతీ ఓటర్‌కు కాల్​చేసి అప్పట్లో ఓట్లను అభ్యర్థించింది బీజేపీ. ఈ కాన్సెప్ట్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లింది. అయితే ఈ సారి వరంగల్ గ్రేటర్ పరిధిలో దాదాపు 6,50,000 మంది ఓటర్లున్నారు. వీరందరికి పార్టీ విధి, విధానాలు, కేంద్ర పథకాల వల్ల కల్గిన ప్రయోజనం, సెంట్రల్​నిధులు, స్మార్ట్​సిటీ వంటి విషయాలను వివరించడంతో పాటు కరోనా ఉధృతి కూడా ఎక్కువగా ఉన్నందునే ఈ యాప్​మార్గాన్ని పార్టీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

Tags:    

Similar News