పార్కులో అశ్లీల బొమ్మ.. బీజేపీ వినూత్న నిరసన
దిశ, నారాయణపేట: నారాయణపేట జిల్లా మహిళా మోర్చా సభ్యులు బొమ్మకు చీర కట్టి నిరసన వ్యక్తం చేశారు. పిల్లలు, యువతీ యువకులు, జనమంతా ఆహ్లాదం కోసం వచ్చే స్థలంలో అశ్లీల బొమ్మ ఏర్పాటు చేయడం మంచిదికాదని, వెంటనే ఆ బొమ్మను తొలగించాలని డిమాండ్ చేశారు. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సైన్స్ పార్కులో ఓ మహిళా బొమ్మను ఏర్పాటు చేశారు. సోమవారం పార్కుకు వెళ్లిన బీజేపీ మహిళా […]
దిశ, నారాయణపేట: నారాయణపేట జిల్లా మహిళా మోర్చా సభ్యులు బొమ్మకు చీర కట్టి నిరసన వ్యక్తం చేశారు. పిల్లలు, యువతీ యువకులు, జనమంతా ఆహ్లాదం కోసం వచ్చే స్థలంలో అశ్లీల బొమ్మ ఏర్పాటు చేయడం మంచిదికాదని, వెంటనే ఆ బొమ్మను తొలగించాలని డిమాండ్ చేశారు. వివరాళ్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన సైన్స్ పార్కులో ఓ మహిళా బొమ్మను ఏర్పాటు చేశారు. సోమవారం పార్కుకు వెళ్లిన బీజేపీ మహిళా మోర్చా నేతలు వెంటనే ఆ బొమ్మను తొలగించాలని, మహిళలను కించపరిచే విధంగా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేగాకుండా.. ఆ బొమ్మకు చీరకట్టి నిరసన తెలిపారు. మానసిక ప్రశాంతత కోసం ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చే పార్కులో మహిళలు తల దించుకునేలా అశ్లీల బొమ్మ ఏర్పాటు చేయడం మహిళల మనోభావాలు దెబ్బతీయడమే అని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ శ్యామ్ సుందర్ గౌడ్, జిల్లా కార్యదర్శులు బైరంకొండ జ్యోతి, సుజాత, పట్టణ మహిళా కౌన్సిలర్లు అనూష, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రఘు రామయ్య గౌడ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సత్య రఘుపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.