ఇదేనా మీ రాజకీయం.. మహిళలను బెదిరిస్తారా : ఈటల ఫైర్
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హుజురాబాద్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సంఘాలను, మహిళా సంఘాలను వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫైర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : హుజురాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్న విషయం తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో హుజురాబాద్‌లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల సంఘాలను, మహిళా సంఘాలను వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నన్ను ఓడించడానికి.. ఓట్ల కోసం అందర్నీ బెదిరిస్తూ.. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఎద్దేవ చేశారు. చిన్నపాటి ఇబ్బందులున్నా.. ప్రజలందరూ నా వైపే ఉన్నారని ఈటల అన్నారు.