బీజేపీతోనే ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది : విఠల్

దిశ, తెలంగాణ బ్యూరో : ​స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉద్యమకారుడు విఠల్ ​తెలిపారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి నఖ్వీ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు చందు శ్రీనివాస్​రావు, టీ. శ్రీనివాస్​రావు, వివేక్ సైతం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా వారికి కేంద్ర మంత్రి నఖ్వీ పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని, కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం […]

Update: 2021-12-06 03:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ​స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఉద్యమకారుడు విఠల్ ​తెలిపారు. సోమవారం ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి నఖ్వీ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు చందు శ్రీనివాస్​రావు, టీ. శ్రీనివాస్​రావు, వివేక్ సైతం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కాగా వారికి కేంద్ర మంత్రి నఖ్వీ పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని, కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం విఠల్​మాట్లాడుతూ.. ఈరోజును నేను మరచిపోలేనని అన్నారు. అంబేడ్కర్​వర్ధంతి సందర్భంగా ప్రపంచంలోనే పెద్ద పార్టీలో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఘర్​వాపస్ వచ్చినందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు.

తెలంగాణలో ఉద్యమకారులను టీఆర్‌ఎస్​ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాష్టంలో 2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నాయని వెల్లడించారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని ఆయన చెప్పారు. ఉద్యమ సమయంలో 1500 మంది విద్యార్ధులు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చాకా కూడా ఉద్యోగాల కోసం యువత, నిరుద్యోగులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ నివేదిక ప్రకారం 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు గ్రూప్-1 ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు.

ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని విఠల్​తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. బీజేపీతోనే తెలంగాణ ప్రజలకు, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ని గెలిపిస్తే వాళ్ళు వెళ్ళి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవులు తీసుకుంటున్నారని విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని విఠల్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News