భాగ్యలక్ష్మీ ఆలయం పాకిస్తాన్‌లో ఉందా?

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరదసాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడి, దొంగ లేఖ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తాను లేఖ రాయలేదని ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసిందని వెల్లడించారు. ఇదంతా టీఆర్ఎస్ కుట్రలో భాగమే అని అన్నారు. […]

Update: 2020-11-21 03:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వరదసాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడి, దొంగ లేఖ సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా తాను లేఖ రాయలేదని ఎన్నికల సంఘం కూడా స్పష్టం చేసిందని వెల్లడించారు. ఇదంతా టీఆర్ఎస్ కుట్రలో భాగమే అని అన్నారు. చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి తాను ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. భాగ్యలక్ష్మీ ఆలయం పాకిస్తాన్‌లో ఉందా అని మండిపడ్డారు. వదరసాయం తాను ఆపలేదని, మీరు ఎక్కడికి రామ్మంటే తాను అక్కడికే వస్తా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

Tags:    

Similar News