గ్రేటర్‌లో పాదయాత్ర చేస్తా : బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ చట్టానికి అతీతం కాదని, రాజ్యాంగం ప్రకారం.. నడుచుకోకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని వెల్లడించారు. టీఆర్ఎస్, ఎమ్ఐఎం పార్టీలు తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాను మార్చుకుంది అని విమర్శించారు. పథకం ప్రకారమే ఓటర్ల జాబితా నుంచి హిందువుల […]

Update: 2020-11-09 09:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ చట్టానికి అతీతం కాదని, రాజ్యాంగం ప్రకారం.. నడుచుకోకుంటే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని వెల్లడించారు. టీఆర్ఎస్, ఎమ్ఐఎం పార్టీలు తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాను మార్చుకుంది అని విమర్శించారు.

పథకం ప్రకారమే ఓటర్ల జాబితా నుంచి హిందువుల ఓట్లను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఓటర్ల జాబితాను సరిచేసిన తర్వాతనే ఎన్నికల హెడ్యూల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాగ్యనగరాన్ని పాతబస్తీ మాదిరి చేయాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అంతేగాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేస్తూ, గ్రేటర్‌లో పాదయాత్ర చేస్తానని సూచించారు.

Tags:    

Similar News