మరో మూడేళ్లు కేసీఆరే సీఎం.. కేటీఆర్‌కు చాన్స్ లేదు: బండి సంజయ్
దిశ ప్రతినిధి, వరంగల్ : మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబ, గడీల, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు మరికొద్దిరోజుల్లో జరగనున్న నేపథ్యంలో పార్టీని సన్నద్ధం చేసేందుకు ఆయన అర్బన్ జిల్లాలో మంగళవారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన సంజయ్ […]
దిశ ప్రతినిధి, వరంగల్ : మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ కొనసాగుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదని చెప్పారు. ఇదే సమయంలో కేసీఆర్ కుటుంబ, గడీల, అవినీతి ప్రజావ్యతిరేక పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు మరికొద్దిరోజుల్లో జరగనున్న నేపథ్యంలో పార్టీని సన్నద్ధం చేసేందుకు ఆయన అర్బన్ జిల్లాలో మంగళవారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన సంజయ్ మార్గమధ్యలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లల్లో కార్యకర్తలను పలకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము ఉన్న ఏకైక పార్టీ బీజేపీయేనని ఉద్ఘాటించారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీ వైపు నిలబడుతున్నారని చెప్పారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగిన దుబ్బాక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలని గుర్తు చేశారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కబ్జాల పర్వానికి కేసీఆర్ చమరగీతం పాడకపోతే బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
అనంతరం వరంగల్ చేరుకున్న బండి సంజయ్‌కు ఆపార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో కాజీపేట కడిపికొండ బ్రిడ్జి వద్ద బైక్ ర్యాలీతో బండి సంజయ్‌ను ఆహ్వానించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత బండి సంజయ్ తొలిసారి వరంగల్ వచ్చారు. దీంతో వరంగల్ జిల్లా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.