సీఎం కేసీఆర్‌కు ఆ శ్రద్ధ లేదు: మురళీధర్‌రావు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్‌రావు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యారంగం దారుణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వైఫల్యం గురించి ముందే చెప్పామని.. నియంత్రిత సాగు విధానంపై కూడా ఆచరణకు సాధ్యం కాదని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఎంత చెప్పినా తెలంగాణ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో వెళ్తోందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు కుటుంబం ఉన్న […]

Update: 2021-01-04 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్‌రావు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్యారంగం దారుణంగా తయారైందని అసహనం వ్యక్తం చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ లేక విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి వైఫల్యం గురించి ముందే చెప్పామని.. నియంత్రిత సాగు విధానంపై కూడా ఆచరణకు సాధ్యం కాదని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఎంత చెప్పినా తెలంగాణ ప్రభుత్వం రివర్స్ గేర్‌లో వెళ్తోందని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్‌కు కుటుంబం ఉన్న శ్రద్ధ పాలనపై లేదని అటువంటిది ఉద్యోగ సంఘాల నాయకులు కేసీఆర్ భజన చేయడం సరికాదని మురళీధర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News