కొత్త సీసాలో పాత సారాలా ఉంది: డీకే అరుణ

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎదుగుదల చూసి టీఆర్ఎస్‌కు వణుకు మొదలైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. 2016 మేనిఫెస్టో అంశాలనే టీఆర్‌ఎస్ మళ్లీ కొత్తగా విడుదల చేసిందన్నారు. కొత్త సీసాలో పాత సారాయి మాదిరిగా తెరాస మేనిఫెస్టో ఉందని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే ఎంఐఎంతో తెరాస పొత్తు పెట్టుకుందన్నారు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. రూ.67వేల కోట్లు ఖర్చు పెడితే నగరం వరదల్లో మునిగేదా […]

Update: 2020-11-23 06:02 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎదుగుదల చూసి టీఆర్ఎస్‌కు వణుకు మొదలైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. 2016 మేనిఫెస్టో అంశాలనే టీఆర్‌ఎస్ మళ్లీ కొత్తగా విడుదల చేసిందన్నారు. కొత్త సీసాలో పాత సారాయి మాదిరిగా తెరాస మేనిఫెస్టో ఉందని చెప్పారు. కేవలం ఓట్ల కోసమే ఎంఐఎంతో తెరాస పొత్తు పెట్టుకుందన్నారు.

ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుందని తెలిపారు. రూ.67వేల కోట్లు ఖర్చు పెడితే నగరం వరదల్లో మునిగేదా అని ప్రశ్నించారు. రెండో సారి అధికారం ఇస్తే ప్రజలకు టీఆర్ఎస్ ఏం చేసిందన్నారు. పాతబస్తీ ఇప్పటికీ ఎందకు అధ్వానంగా ఉందో ఎంఐఎం నేతలే చెప్పాలని ప్రశ్నించారు. గ్రేటర్ లో ఓట్లు అడిగే హక్కు టీఆర్ఎస్‌కు లేదన్నారు.

సైబరాబాద్ డివిజన్‌లో రోడ్ షోలో ఆమె పాల్గొన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. ఉత్తమ్, ఆయన అనుచరులు, సోషల్ మీడియా నిర్వాహకులపై ఆమె తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అవుతోందని అన్నారు.

Tags:    

Similar News