తీన్మార్ మల్లన్న కేసులపై బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో : చంచల్ గూడ జైలులో ఉన్న క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను ములాఖత్ ద్వారా ఎంపీ అర్వింద్ సోమవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మల్లన్నని మారుమూల సెల్‌లో ఒక్కడినే ఉంచారని, జైలు అధికారులు మల్లన్నను తీవ్రవాదిలా చూస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారన్నారని అర్వింద్ ఆరోపించారు. మల్లన్నపై పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టొద్దని హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్‌ మల్లన్న […]

Update: 2021-10-04 05:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : చంచల్ గూడ జైలులో ఉన్న క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను ములాఖత్ ద్వారా ఎంపీ అర్వింద్ సోమవారం కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మల్లన్నని మారుమూల సెల్‌లో ఒక్కడినే ఉంచారని, జైలు అధికారులు మల్లన్నను తీవ్రవాదిలా చూస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారన్నారని అర్వింద్ ఆరోపించారు. మల్లన్నపై పెట్టిన కేసులే మళ్లీ మళ్లీ పెట్టొద్దని హైకోర్టు చీవాట్లు పెట్టినా ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీన్మార్‌ మల్లన్న జైలు నుంచి విడుదల కాగానే బీజేపీలోకి వస్తారని ఎంపీ ప్రకటించారు. కేసీఆర్, కేటీఆర్ అప్రజాస్వామికంగా నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెబుతారన్నారు.

Tags:    

Similar News