బీజేపీ లీడర్ల వినూత్న నిరసన.. ఏకంగా ఎడ్లబండి తో..

దిశ, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆర్మూర్ మండల నాయకులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఎడ్ల బండి కట్టి నిరసన ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ఆర్మూర్ […]

Update: 2021-11-29 03:39 GMT

దిశ, ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆర్మూర్ మండల నాయకులు సోమవారం వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఎడ్ల బండి కట్టి నిరసన ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

ప్రజలపై పడుతున్న అధిక వ్యాట్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్, ఎంపీటీసీలు శ్రీనివాస్, ముకేశ్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంతం మురళి, బీజేవైఎం మండల అధ్యక్షుడు నరేశ్, కిసాన్ మోర్చా నాయకుడు లింగం, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News