బురదమయమైన రోడ్లు.. నాట్లు వేసి నిరసన

దిశ, దేవరకొండ: దేవరకొండ మండల పరిధిలోని తాటికోల్ గ్రామంలోని రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచి బురదమయంగా మారాయి. దీంతో సోమవారం బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పబ్బు సైదులు మాట్లాడుతూ…పేరు గొప్ప ఊరు దిబ్బలా ఊరి పరిస్థితి తయారై, రోడ్ల మీద పాదచారులు నడిచే పరిస్థితి లేకుండా పోయింది అని అన్నారు. నియోజక కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనున్న గ్రామం […]

Update: 2020-07-27 10:01 GMT

దిశ, దేవరకొండ: దేవరకొండ మండల పరిధిలోని తాటికోల్ గ్రామంలోని రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే నీళ్లు నిలిచి బురదమయంగా మారాయి. దీంతో సోమవారం బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పబ్బు సైదులు మాట్లాడుతూ…పేరు గొప్ప ఊరు దిబ్బలా ఊరి పరిస్థితి తయారై, రోడ్ల మీద పాదచారులు నడిచే పరిస్థితి లేకుండా పోయింది అని అన్నారు. నియోజక కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనున్న గ్రామం ఇలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా తయారైందని, ఇప్పటికైనా స్పందించి రోడ్లపై నీరు నిల్వ ఉండకుండేలా చేయాలని కోరారు.

Tags:    

Similar News