రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం

దిశ, మెదక్: ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ సెంటిమెంట్‌తో గద్దెనెక్కిన కేసీఆర్.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప పోరులో బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన తట్టుకోలేకే హరీశ్ రావు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పడుతున్నాయని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడం […]

Update: 2020-10-30 08:54 GMT

దిశ, మెదక్: ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ సెంటిమెంట్‌తో గద్దెనెక్కిన కేసీఆర్.. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప పోరులో బీజేపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన తట్టుకోలేకే హరీశ్ రావు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పడుతున్నాయని, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలవడం ఖాయమైందని, అందుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూస్తుంటేనే తెలుస్తుందన్నారు. గల్లీలో బొంగరం తిప్పడం చేతగాని నేతలు, ఢిల్లీలో బొంగరం తిప్పుతామని నోటికి వచ్చింది మాట్లాడారని, ఫ్రంట్‌కు టెంట్ కూడా లేకుండా పోయిందని ఛలోక్తులు విసిరారు. నిజామాబాద్‌లో చెల్లని రూపాయిని దొడ్డిదారిన ఎమ్మెల్సీగా చేశారని, ఇన్నాళ్లు తెరవెనుక ఉన్న సంతోష్‌ను తీసుకువచ్చి చక్రం తిప్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే జనం బీజేపీకి నీరాజనం పడుతున్నారని అన్నారు.

Tags:    

Similar News