జనావాసాల మధ్య ఖననం.. బీజేపీ నిరసన

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్‌లో సోమవారం రాత్రి హిందూ స్మశాన వాటికలో కరోనా మృతదేహాన్ని ఎలాంటి శానిటైజేషన్ లేకుండా ఖననం చేశారు. దీంతో కోదాడ మున్సిపల్ కమిషనర్, శానిటరీ, ఇన్సెక్టర్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం కోదాడ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్సు వేళంగి రాజు మాట్లాడుతూ.. కరోనా మృతదేహానికి ఎటువంటి శానిటైజేషయన్ చేయకుండా జనావాసాల […]

Update: 2020-08-11 06:10 GMT

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్‌లో సోమవారం రాత్రి హిందూ స్మశాన వాటికలో కరోనా మృతదేహాన్ని ఎలాంటి శానిటైజేషన్ లేకుండా ఖననం చేశారు. దీంతో కోదాడ మున్సిపల్ కమిషనర్, శానిటరీ, ఇన్సెక్టర్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం కోదాడ బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్సు వేళంగి రాజు మాట్లాడుతూ..

కరోనా మృతదేహానికి ఎటువంటి శానిటైజేషయన్ చేయకుండా జనావాసాల మధ్య ఉన్నటువంటి స్మశాన వాటికలో పూడ్చిపెట్టడం అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, అంతేగాకుండా ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. కరోనా ఉదృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతి రోజు మరణాలు జరుగుతున్నందున స్మశాన వాటిక మరియు చుట్టుపక్కల ప్రతి రోజు శానిటైజేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News