మంత్రి పువ్వాడ కారును అడ్డుకున్న బీజేపీ నేతలు

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. దీంతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కూకట్‌పల్లి ఫోరం మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారును స్థానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మంత్రి కారులో డబ్బులు పంచుతున్నారని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ మధ్యలో బీజేపీ […]

Update: 2020-12-01 01:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. దీంతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కూకట్‌పల్లి ఫోరం మాల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారును స్థానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. మంత్రి కారులో డబ్బులు పంచుతున్నారని ఆందోళన నిర్వహించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ మధ్యలో బీజేపీ నేతలు ఆగ్రహంతో ఓ వ్యక్తిని పట్టుకొని చితకబాదారు.

దీనిపై ఎమ్మెల్యే కృష్ణారావు స్పందిస్తూ… కావాలనే బీజేపీ కార్యకర్తలు గొడవలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు పోలింగ్‌లో అశాంతి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఓటర్లంతా ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కూకట్‌పల్లి, బాలాజీనగర్‌లో బీజేపీ రౌడీ షీటర్లకు టికెట్లు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్ల వల్లే ఈ ఘర్షణ వాతావరణం నెలకొందని అన్నారు.

Tags:    

Similar News