నోరు జారిన బీజేపీ నేత.. ఇరకాటంలో పడ్డ ఈటల
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దళితులకు దళిత బంధు క్రింద రూ.10 లక్షలు ఇస్తే వాటిని తాగుడుకు ఖర్చు చేస్తారని, వారు వ్యసన పరులు అవుతారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ అని వివాదాస్పద వాఖ్యలు చేసారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ లో హుజూరాబాద్ ఉప ఎన్నికలు, దళిత బంధు పథకం సందర్బంగా లైవ్ డిబేట్ జరిగింది. అందులో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ దళితుల […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దళితులకు దళిత బంధు క్రింద రూ.10 లక్షలు ఇస్తే వాటిని తాగుడుకు ఖర్చు చేస్తారని, వారు వ్యసన పరులు అవుతారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ అని వివాదాస్పద వాఖ్యలు చేసారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ లో హుజూరాబాద్ ఉప ఎన్నికలు, దళిత బంధు పథకం సందర్బంగా లైవ్ డిబేట్ జరిగింది. అందులో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ దళితుల పై చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు, దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సామాజిక మాధ్యమాల్లో చాలా మంది మాజీ ఎమ్మెల్యే మాటలను తప్పు పడుతున్నారు. ప్రభుత్వాలు చేసే సహాయం ను దళితులు ఎదగడానికి కాకుండా వ్యసనాలా కోసం ఖర్చు చేసే వ్యసనాపరులుగా భావిస్తున్నట్టు ఉందని అగ్గి మీద గుగ్గిళం అవుతున్నారు. దీనిపై విపరీతంగా షేర్లు, ట్రోల్ చేస్తున్నారు. దళిత సంఘాల ప్రెస్ మీట్‌లు పెట్టి ఖండించడమే కాకుండా క్షమాపణలు చెప్పాలని బుధవారం ఆందోళన కు పిలుపు నిచ్చాయి.
ఈటలకు చేటు తెచ్చిన యెండల వాఖ్యలు….
అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ను హుజరాబాద్ లో పైలట్ పథకం గా అమలు చేసి ఓట్లను కొల్లగొట్టే పథకం ను పక్కగా అమలు చేసే ఆలోచనలో ఉన్నారు. దానిని ఎదురుకునేందుకు ప్రతి పక్ష బీజేపీ నానా తంటాలు పడుతోంది. ఇలాంటి సమయంలో ఆచి తుచి మాట్లాడవలసిన బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. అందున బీజేపీ తరుపున మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎలక్షన్ లో తల పడుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేటు తెస్తాయంటున్నారు. అంతే కాకుండా బీజేపీలో సీనియర్ నేత యెండల లక్ష్మి నారాయణ హుజురాబాద్ నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ గా ఉండగా ఈ వాఖ్యలు చేయడం అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త అస్త్రం ఇచ్చినట్టు అని అంటున్నారు. హుజురాబాద్ ఎన్నికల నగరా మొగక ముందే రాజకీయాల్లో బీజేపీ నేత మాటలు హీట్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం హుజురాబాద్ సంగతి దేవుడు ఎరుగు కానీ నిజామాబాద్ నేతలు, దళితులు యెండల లక్ష్మి నారాయణ పై మండి పడుతున్నారు.
నాడు డీఎస్ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎమ్మెల్యే గా గెలిచిన యెండల…
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నియోజకవర్గల పునరవిభజన తో ఏర్పాటు కాగా దానికి తొలి ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ. 2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాటి ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ తరుపున, యెండల లక్ష్మి నారాయణ బీజేపీ తరుపున బరిలో నిలిచారు. అప్పటికి ఒక దఫా వైఎస్సార్, డీఎస్ ల జోడి కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తెచ్చింది. రెండో విడత వారే కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తీసుకురావడానికి ఎన్నికల బరి లో నిలుచున్నారు. అంతా డీఎస్ గెలుపు లంఛానమే అనుకున్నారు.
కానీ ఎన్నికల ప్రచారంలో మైనార్టీ వర్గం కోసం డీఎస్ చేసిన వాఖ్యలు ఆయన పై మెజారిటీ వర్గ ప్రజలను దూరం చేసి ఓటమి కొని తెచ్చుకున్నాయి. నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన డీఎస్ కు అధికారం ను దూరం చేసి తెలంగాణ ఉద్యమం కాలంలో సీఎం కాకుండా చేసింది. నాటి నుంచి డీఎస్ కు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు అనేది లేకుండా పోయింది. నాటి డీఎస్ వివాదాస్పద మాటలతో ఎమ్మెల్యే అయినా యెండల తన రాజకీయ భవిష్యత్ కోసం పాటుపడుతూ, ఇలాంటి వాఖ్యలు చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు పెద్ద దెబ్బ అంటున్నారు నేతలు.