మోడీ మానిటర్ చేసినట్టు.. జగన్‌ ఎందుకు చేయడం లేదు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచి, నిరంతరం స్పందించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. వైరస్ విస్తరిస్తోన్న తరుణంలో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా నిర్ధారణ టెస్టుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని తెలిపారు. అంతేగాకుండా.. ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని […]

Update: 2021-04-29 02:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచి, నిరంతరం స్పందించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. వైరస్ విస్తరిస్తోన్న తరుణంలో రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కరోనా నిర్ధారణ టెస్టుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని తెలిపారు. అంతేగాకుండా.. ఆస్పత్రుల్లో బెడ్ల వివరాలు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ మానిటర్ చేసినట్టు.. సీఎం జగన్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయలేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీలను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని అన్నారు. ఆరోగ్య శ్రీలో కరోనా వైద్యం జరుగడం లేదని వెల్లడించారు.

Tags:    

Similar News