టీఆర్ఎస్ ధర్నాలు విఫలమయ్యాయి.. మాదగోని విమర్శలు
దిశ, నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆ పార్టీనేతలు ధర్నాకు దిగారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ చేసిన ధర్నా పూర్తిగా విఫలమైందని, కార్యకర్తలు తప్ప రైతులెవరూ పాల్గొన లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని ఎన్నడూ చెప్పలేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం జీవో […]
దిశ, నల్లగొండ: టీఆర్ఎస్ ప్రభుత్వ చేతగాని తనంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఆ పార్టీనేతలు ధర్నాకు దిగారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ చేసిన ధర్నా పూర్తిగా విఫలమైందని, కార్యకర్తలు తప్ప రైతులెవరూ పాల్గొన లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనబోమని ఎన్నడూ చెప్పలేదని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందంటూ తప్పుడు ప్రసారం చేస్తోందని అన్నారు.
అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. వరిధాన్యం కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదన్నారు. ఆంధ్రా ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్‌లో నిద్రపోతున్నాడని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఓటర్లు ఎన్నికల్లో కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. బండి సంజయ్‌పై చేస్తున్న ఆరోపణలు బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందనే భరించలేక టీఆర్ఎస్ ధర్నాలకు దిగుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మొరిశెట్టి నాగేశ్వరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, నాయకులు నాగరాజు, నాగిరెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, రాఖి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.